రెండున్నర ఏళ్లలో 250 వరకు రోబోటిక్ ఆపరేషన్లు..!
HYDలో MNJ క్యాన్సర్ ఆసుపత్రిలో రోబోటిక్ వైద్య విధానం ఉన్నతంగా కొనసాగుతోంది. గత 30 నెలల్లో సుమారు రూ.12.5 కోట్ల విలువైన రోబోటిక్ శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. రెండున్నర సంవత్సరాల వ్యవధిలో రికార్డు స్థాయిలో 250 వరకు రోబోటిక్ ఆపరేషన్లు విజయవంతంగా చేశారు.