VIDEO: బాలానగర్ అండర్‌పాస్ బ్రిడ్జి పనులు ఆలస్యం
MBNR: బాలానగర్ మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న అండర్‌పాస్ బ్రిడ్జి పనులు గత 18 నెలలుగా కొనసాగుతున్నాయి. నిర్దేశిత కాలంలో పూర్తి కాకపోవడంతో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్రిడ్జి ఆలస్యం కారణంగా రాకపోకల్లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అధికారులు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు.