ఆరుద్ర శత జయంతి వేడుకలు

E.G: రాజమహేంద్రవరంలోని బ్రహ్మ మందిరంలో ఆదివారం ఆరుద్ర శతజయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఆరుద్ర రచనలలో భారతీయత, రాజమహేంద్రవరం పట్టణ విశిష్టత, గోదావరి నది గొప్పతనం వంటి అంశాలు ప్రతిఫలించాయని కొనియాడారు.