సుప్రీంకోర్టులో అనిల్ అంబానీకి ఎదురుదెబ్బ
పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన తీసుకున్న రుణాల రికవరీ కోసం బ్యాంకులు చర్యలు తీసుకునేందుకు బాంబే హైకోర్టు అనుమతించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అనిల్ అంబానీ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, సుప్రీంకోర్టు ఆయన పిటిషన్‌ను కొట్టేసింది.