అమ్మవారిని దర్శించుకున్న టీడీపీ జిల్లా అధ్యక్షులు

అమ్మవారిని దర్శించుకున్న టీడీపీ జిల్లా అధ్యక్షులు

ATP: గుంతకల్లు మండలం అమిన్ పల్లి గ్రామంలో మంగళవారం అమ్మవారి దేవర మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్ హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారి కుటుంబ సభ్యుల పేర్ల మీద ప్రత్యేక పూజలు చేసి, అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.