VIDEO: తూప్రాన్‌లో ఆశా వర్కర్ల నిరసన ర్యాలీ
MDK: మనోహరాబాద్, తూప్రాన్ మండలాలకు చెందిన ఆశా వర్కర్లు తూప్రాన్‌లో ఇవాళ నిరసన ర్యాలీ నిర్వహించారు. తమకు ఖచ్చితమైన వేతనం చెల్లించడంతో పాటు పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నర్సాపూర్ చౌరస్తా నుంచి సామాజిక ఆరోగ్య కేంద్రం వరకు ర్యాలీ చేపట్టి, తమ డిమాండ్లకు మద్దతుగా నినాదాలు చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని ఆశా వర్కర్లు కోరారు.