అయ్యప్ప నామస్మరణతో మారుమోగిన బొంతపల్లి

SRD: పటాన్‌చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో పడిపూజ అంగరంగ వైభవంగా జరిగింది. అయ్యప్ప స్వాములు వందలాదిగా తరలివచ్చి అయ్యప్ప స్వామి భజనలు, సంకీర్తనలు, నామస్మరణతో బొంతపల్లి గ్రామం మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.