నిరుపేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ భరోసా: సర్వోత్తమ్ రెడ్డి

SRPT: నిరుపేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేటలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 36 మందికి రూ.19 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. ప్రజా ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచి పేదలకు ఉపయోగపడే విధంగా చొరవ చూపించామన్నారు.