రైతన్న మీ కోసం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
PPM: సాలూరు మండలం మామిడిపల్లి గ్రామంలో నిర్వహించిన “రైతన్న మీ కోసం” కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారం కోసం పలు సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అంటే సంక్షేమం మాత్రమే కాదు సంపద సృష్టించే వ్యవస్థను బలోపేతం చేసే ప్రభుత్వం అని అన్నారు.