దేవరకొండలో ఒకేసారి రెండు చలివేంద్రాలు ప్రారంభం

NLG: దేవరకొండలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం చల్లటి మంచి నీటిని అందించేందుకు చలివేంద్రాలను ప్రారంభించామని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వస్కుల సత్యనారాయణ తెలిపారు. కొత్త బస్టాండ్, నీల పాండురయ్య దుకాణం వద్ద చలివేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ సైదులు, క్లబ్ సభ్యులు ప్రభాకర్ తదితరులున్నారు.