'పెండింగ్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలి'

'పెండింగ్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలి'

HNK: రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బకాయిలు విడుదల చేసేంతవరకు తమ పోరాటం ఆగదని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ అన్నారు. ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్‌మెంట్ విడుదల చేయాలని కాకతీయ యూనివర్సిటీ ముందు దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతుందని ఆరోపించారు.