మళ్లీ వైసీపీలోకి చేరిన ఎంపీపీ

AKP: మునగపాక ఎంపీపీ మల్ల జయలక్ష్మి శనివారం మళ్లీ వైసీపీలోకి చేరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె జనసేన పార్టీలోకి వెళ్లారు. అభివృద్ధి చేస్తామని చెప్పడంతో నమ్మి ఆ పార్టీకిలోకి వెళ్లినట్లు ఆమె తెలిపారు. అయితే ఎటువంటి అభివృద్ధి చేయకపోవడంతో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మ శ్రీ, కన్నబాబురాజు సమక్షంలో ఆమె వైసీపీ కండువా కప్పుకున్నారు.