రైతు బజారును తనిఖీ చేసిన కమీషనర్
VZM: రాజాం మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రావు మంగళవారం స్దానిక రైతు బజారును ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిన్న ఆయనకు రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైతుబజార్‌లో వ్యాపారం జరుగుతున్న తీరును పరిశీలించారు. బయట కూరగాయల వ్యాపారం చేయకూడదని రైతు బజార్‌లోనే చేయాలని ఈ సందర్భంగా హెచ్చరించారు. అలా చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు రైతు బజార్‌లో షాపులు ఖాళీగా ఉన్నాయన్నారు.