VIDEO: పచ్చబొట్టుతో అభిమానాన్ని చాటిన కార్యకర్త

BHPL: మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి జన్మదినం సందర్భంగా శాయంపేట మండలం సూర్య నాయక్ తండాకు చెందిన తిరుపతి నాయక్ తన అభిమానాన్ని చాటాడు. ఆయన మాజీ ఎమ్మెల్యే దంపతుల చిత్రపటాలను చేతిపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ.. "గోడలపై అక్షరాలు చెరపొచ్చు కానీ కార్యకర్తల గుండెల్లోని అభిమానాన్ని కాదు" అన్నారు.