'భారీ వర్షాల నేపథ్యంలో పునరావాస కేంద్రాల ఏర్పాటు'

'భారీ వర్షాల నేపథ్యంలో పునరావాస కేంద్రాల ఏర్పాటు'

RR: అధిక వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం సూచనల మేరకు తక్షణ చర్యలు తీసుకున్నామని ఫరూక్ నగర్ మండలం వెలిజర్ల గ్రామ కార్యదర్శి యాదయ్య తెలిపారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అవసరమైన సదుపాయాలు కల్పించామని, వాగులు, చెరువుల వద్దకు వెళ్లరాదని, పిల్లలను బయటకు పంపవద్దని ప్రజలకు సూచించారు. ప్రాణాలు, ఆస్తులు కాపాడటం తమ బాధ్యత అని అన్నారు.