త్వరలో అందుబాటులోకి నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్

MDK: నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ యాత్రికులను కనువిందు చేసే ప్రాంతమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం అర్బన్ ఫారెస్ట్ పార్క్, ఎకో టూరిజం రిసార్ట్, యాత్రికుల కోసం నిర్మించిన కాటేజీ పనులను పరిశీలించారు. దాదాపు 80% పనులు పూర్తయ్యాయని, మరో 20 రోజుల్లో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని కలెక్టర్ సూచించారు.