వర్ధన్నపేటలో మెప్మా ఆధ్వర్యంలో వైద్య శిబిరం

వర్ధన్నపేటలో మెప్మా ఆధ్వర్యంలో వైద్య శిబిరం

WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీలో మెప్మా ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. గురువారం ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మహిళా సంఘ సభ్యులు, శానిటేషన్ సిబ్బందికి ఈ శిబిరం ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వై.వి గణేష్, కమిషనర్ సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.