రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్

కడప జిల్లాలోని వీ.ఎన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లకు ఎస్సై కృష్ణయ్య కౌన్సిలింగ్ నిర్వహించారు. నేర ప్రవృత్తిని విడిచి సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. నేరాలలో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు నిర్వహించబడింది.