VIDEO: 'సీఐటీయూ మహాసభలు జయప్రదం చేయండి'
SS: పెనుకొండలోని సివిల్ సప్లై గోడౌన్‌లో సీఐటీయూ నాయకులు గురువారం సమావేశం నిర్వహించారు. సీఐటీయూ మండల కార్యదర్శి బాబావలి మాట్లాడుతూ.. డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో సీఐటీయూ ఆలిండియా మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో మహాసభల పోస్టర్ విడుదల చేశారు. మహా సభలను జయప్రదం చేయాలని వారు కోరారు.