'బీజేపీ విధానాలు ప్రజల ఐక్యతకు విఘాతం'

KDP: బీజేపీ విధానాలు దేశ సమైక్యత ప్రజల ఐక్యతకు విఘాతం కలిగిస్తున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం బద్వేల్ పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో కమిటీ సమావేశం జరిగింది. బీజేపీని ప్రజలు దూరం చేయాల్సిన అవసరం ఉందని ఇందుకోసం ప్రజాస్వామ్య లౌకిక కమ్యూనిస్టు శ్రేణులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.