'కెఎల్ రావు పార్క్‌లో థియేటర్ ఏర్పాటు చేయండి'

కృష్ణా: విజయవాడ కేఎల్ రావు పార్క్‌ను ఆహ్లాద భరితంగా చేసేందుకు యాంఫి థియేటర్‌ను ఏర్పాటు చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం తన పర్యటనలో భాగంగా చిట్టినగర్ వద్ద గల కేఎల్ రావు పార్క్‌లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పార్క్ లోపల ఉన్న మరమ్మతులను సత్వరమే పూర్తి చేయాలన్నారు.