VIDEO: మెడికల్ కళాశాలల నిర్మాణంపై వైసీపీ అసత్య ప్రచారం

E.G: రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల నిర్మాణంపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. సోమవారం రాజమండ్రిలో MLA మాట్లాడుతూ.. కళాశాల నిర్మాణం పేరుతో వేలకోట్లు అప్పులు చేశారని మండిపడ్డారు. నిధులను దారి మళ్లించాలని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాలను అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతుందన్నారు.