చికిత్స పొందుతూ.. గుర్తుతెలియని వ్యక్తి మృతి

చికిత్స పొందుతూ.. గుర్తుతెలియని వ్యక్తి మృతి

GDWL: గత నెల 22న అలంపూర్ చౌరస్తా వద్ద వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడిన గుర్తుతెలియని వ్యక్తి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడికి దాదాపు 60 ఏళ్లు ఉంటాయని, తెల్లని అంగి, తెల్ల గడ్డం, ఎడమ కాలికి నల్లటి దారం ఉందని ఎస్సై శేఖర్ తెలిపారు. మృతదేహాన్ని మార్చురీలో ఉంచినట్లు పేర్కొన్నారు.