నిషేధిత పాలిథిన్ కవర్లు వాడితే కఠిన చర్యలు..
సంగారెడ్డి మున్సిపాలిటిలో శనివారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, నిషేధిత పాలిథిన్ కవర్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యాపారులు బట్ట, జూట్ బ్యాగులు మాత్రమే వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ సాజిత్, అధికారులు పాల్గొన్నారు.