గుర్తు తెలియని మృతదేహం లభ్యం
మెదక్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల చెక్ డ్యాం ప్రాంతంలో ఓ గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడు నల్లని ప్యాంటు, బ్లూ కలర్ టీ షర్టు ధరించి ఉన్నాడని, అతని ఎడమ చేతిపై 'స్వరూప' అనే పేరుతో పచ్చబొట్టు ఉందని పాపన్నపేట పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.