VIDEO: దొడ్డిపల్లిలో చిరుత కలకలం

VIDEO: దొడ్డిపల్లిలో చిరుత కలకలం

CTR: నగరం నడిబొడ్డున చిరుతల సంచారం కలకలం రేపుతోంది. దొడ్డిపల్లి జగనన్న లేఔట్‌లో గత మూడు రోజులుగా చిరుతలు తిరుగుతున్నాయి. ఈ క్రమంలో ఒక చిరుత స్పృహ తప్పి పడిపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తిరుపతి నుంచి రావాల్సిన రెస్క్యూ బృందం కోసం అటవీశాఖ అధికారులు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా, చిరుతను చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. చిరుతల సంచారంతో స్థానికుల్లో భయం నెలకొంది.