వరంగల్ పోలీసులపై డీజీపీకి ఎమ్మెల్సీ ఫిర్యాదు

వరంగల్ పోలీసులపై డీజీపీకి ఎమ్మెల్సీ ఫిర్యాదు

WGL: నగర పోలీసులపై ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య డీజీపీ శివధర్ రెడ్డికి ఇవాళ ఫిర్యాదు చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గత రెండేళ్లుగా నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై విచారణ జరిపి, దుర్వినియోగానికి పాల్పడిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే వరంగల్ సీపీకి కూడా ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.