భవానీదీక్షల విరమణ.. సర్వం సిద్ధం
AP: ఇంద్రకీలాద్రిపై భవానీదీక్షల విరమణ సమయంలో అంతరాలయ దర్శనాలు ఉండవని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. అన్ని ఆర్జిత సేవలు, టికెట్ దర్శనాలు రద్దు చేసినట్లు తెలిపారు. ఐదు క్యూలైన్లలో భవానీ దీక్షదారులకు ఉచిత దర్శనానికి అనుమతించారు. దీక్ష విరమణలకు సుమారు 6 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. వినాయక గుడి నుంచి క్యూలైన్లలోకి దీక్షదారులకు ప్రవేశం కల్పిస్తున్నారు.