VIDEO: కూలిన ఇల్లు.. తప్పిన ప్రమాదం

GDWL: ఉండవెల్లి మండలం బొంకూరు గ్రామంలో ఇల్లు కూలిపోయింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామానికి చెందిన శరవయ్య ఆచారి ఇల్లు లోపలి భాగం మొత్తం కూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇల్లు కూలడంతో దిక్కుతోచని స్థితిలో బాధిత కుటుంబం ఉంది. ప్రభుత్వం వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని గ్రామస్తులు కోరారు.