కళ్యాణ రామచంద్రస్వామి ధనుర్మాస ఉత్సవాలు

కళ్యాణ రామచంద్రస్వామి ధనుర్మాస ఉత్సవాలు

MDK: పురపాలక సంఘం రామాయంపేట పాండ చెరువు కట్ట పైన ఉన్న శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం 24వ మంగళ పారుశం సందర్భంగా స్వామివారికి సామూహిక దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆలయాన్ని దీపాలతో అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.