ధర్మ మార్గాన్ని బోధించిన శ్రీకృష్ణుడు

HYD: మానవాళికి భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడు ధర్మ మార్గాన్ని బోధించారని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శనివారం సికింద్రాబాద్ ఇస్కాన్ టెంపుల్‌ను ఎమ్మెల్యే దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఆయన ధర్మం, ప్రేమ, కరుణ బోధనలు నేటికీ మనకు స్ఫూర్తి అని అన్నారు.