నర్సీపట్నం టౌన్ సీఐ గోవిందరావు బదిలీ

నర్సీపట్నం టౌన్ సీఐ గోవిందరావు బదిలీ

AKP: నర్సీపట్నం టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గోవిందరావుకు బదిలీ అయింది. ఆయనను విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఆఫీసుకు అటాచ్ చేశారు. సీఐ గోవిందరావు గత సంవత్సర కాలంగా నర్సీపట్నం టౌన్ సీఐగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన హయంలో ఎన్నో క్లిష్టమైన కేసులు పరిష్కరించి ఉన్నత అధికారుల నుంచి అవార్డులు అందుకున్నారు.