జిల్లా కేంద్రంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

జిల్లా కేంద్రంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

MNCL: సార్వత్రిక సమ్మెలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం ఏఐటీయూసీ నాయకులు కార్మిక సంఘాల నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నినాదాలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తున్నామన్నారు. అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్, ఇతర కార్మిక సంఘాల నాయకులు ఉన్నారు.