రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక: కలెక్టర్
SS: జిల్లాలోని అన్ని మండల, డివిజన్, మున్సిపల్ కార్యాలయాలలో రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక జరుగుతుందని కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. అర్జీదారులు నేరుగా కలెక్టరేట్‌కు రాకుండా meekosam.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సమస్య పరిష్కార సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చని కలెక్టర్ సూచించారు.