'ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం చేయండి'
SRPT: హుజూర్‌నగర్ LO రామస్వామి గుట్ట వద్ద చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం పనులను పరిశీలించిన ఆయన, అదనపు కార్మికులతో పనులు వేగవంతం చేసి, మార్చి మొదటి వారంలో ముఖ్యమంత్రి రేవంత్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించేలా సిద్ధం చేయాలని సూచించారు.