విద్యుత్ షాక్ తగిలి వివాహిత మృతి

ప్రకాశం: బేస్తవారిపేట పట్టణం అమ్మవారి శాల వీధి వద్ద వేకువ జామున కులాయి నుండి నీరు పట్టే క్రమంలో మోటార్ వైర్ ద్వారా విద్యుత్ షాక్‌కు గురై లక్ష్మి (32) అనే వివాహిత మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు పిల్లలు భర్త ఉన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న బేస్తవారిపేట SI రవీంద్రారెడ్డి ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.