ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

MHBD: కేసముద్రం మండల కేంద్రంలోని గాంధీ సెంటర్‌లో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అల్లం నాగేశ్వర్ రావు, జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి, పీసీసీ మెంబర్ దశ్రు నాయక్ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.