VIDEO: మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని ఆందోళన

NLR: కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అనుచరులు హత్యాయత్నానికి పాల్పడ్డారని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు కావలిలోని ఉదయగిరి బ్రిడ్జి వద్ద మంగళవారం రాత్రి ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యేపై హత్యాయత్నానికి పాల్పడిన వారితో పాటు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేశారు.