'రాజాసాబ్' నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్
ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ హారర్ ఫిల్మ్ 'ది రాజా సాబ్'. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఈ సినిమా నుంచి మొదటి పాట 'రెబల్ సాబ్'ను విడుదల చేసింది. తమన్ మ్యూజిక్ అందించిన పాట ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.