వైఎస్ జగన్‌ను కలిసిన శైలజానాథ్

ATP: శింగనమల వైసీపీ ఇంఛార్జి సాకే శైలజానాథ్ మాజీ సీఎం జగన్‌ను కలిశారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి తనను శింగనమల ఇంఛార్జి నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాని చెప్పారు.