VIDEO: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. 12 మందికి గాయాలు
SKLM: ఎచ్చెర్ల(మం) జర్జంగి గ్రామంలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు ఆటోను ఢీకొనడంతో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు వెంటనే పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.