'29న దీక్షా దివస్ జయప్రదం చేయాలి'
SRD: ఈనెల 29వ తేదీన దీక్ష దివస్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కోరారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ దీక్ష చేయడం వల్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజల బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.