ఇంటి పన్నులు సకాలంలో చెల్లించాలి: ఎమ్మెల్యే
NLR: గ్రామాల్లో ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచించారు. విడవలూరు మండలంలో 128 డస్ట్ బిన్స్, 28 రిక్షాలను స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా పంపిణీ చేశామన్నారు. ధాన్యం సీజన్ వచ్చింది కాబట్టి గ్రామాలలో ఇంటి పన్నులు చెల్లించని రైతులు ఎవరైనా ఉంటే చెల్లించి పంచాయతీల అభివృద్ధికి సహకరించాలన్నారు.