నెల్లూరు అభివృద్దే లక్ష్యం: నారాయణ

నెల్లూరు అభివృద్దే లక్ష్యం: నారాయణ

NLR: నగరంలోని ఎన్టీఆర్ నగర్లో రూ.25లక్షలతో ఆధునీకరించిన ఈఎల్ఎస్ఆర్ పార్కును ఆదివారం మంత్రి నారాయణ ప్రారంభించారు. ఓపెన్ జిమ్, ప్లే ఎక్విప్‌మెంట్‌ను ప్రారంభించిన మంత్రి, చిన్నారులతో కాసేపు సరదాగా గడిపారు. స్థానికులు, మహిళలు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. నెల్లూరును అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.