రెండు ఎకరాల జీడి మామిడి తోట దగ్ధం

రెండు ఎకరాల జీడి మామిడి తోట దగ్ధం

విశాఖ: కొయ్యూరు మండలం గోపవరం గ్రామానికి చెందిన గుమ్మా వెంకటకృష్ణ, సింహాచలం లకు చెందిన రెండు ఎకరాల జీడి మామిడి తోట అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. పంట చేతికి వచ్చే సమయంలో అగ్ని ప్రమాదంలో తోట కాలిపోవడంతో బాధిత కుటుంబీకులు లబోదిబో మంటున్నారు. ఏడాది కష్టమంతా అగ్నికి ఆహుతి అవటంతో తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వమే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.