'రైతన్న-మీకోసం' కార్యక్రమంలో ఎమ్మెల్యే
ATP: రామగిరి మండలం కొత్త గాదిగకుంట గ్రామంలో నిర్వహించిన 'రైతన్న-మీకోసం' కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. అక్కమ్మ గుడిలో పూజలు నిర్వహించి, ప్రజలతో కలిసి 5 ఎకరాల్లో 500 చింత మొక్కలు నాటారు. రైతులకు 'అన్నదాత సుఖీభవ' పథకం గురించి వివరించి, సబ్సిడీపై పశువుల దాణా, వ్యాక్సిన్లు అందజేశారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు.