'వైద్యరంగంలో పరిశోధనలు పెరగాలి'

'వైద్యరంగంలో పరిశోధనలు పెరగాలి'

VZM: వైద్యరంగంలో పరిశోధనలను పెంచాలని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ VC డాక్టర్‌ చంద్రశేఖర్‌ పిలుపునిచ్చారు. బుధవారం విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించారు. పరిశోధనలకు రూ.50 లక్షలు, క్రీడా కార్యకలాపాలకు రూ.10 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు ఈ-జర్నల్స్ సభ్యత్వం తీసుకోవాలన్నారు.