సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ

VZM: నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి శుక్రవారం భోగాపురం మండలం ముంజేరు జనసేన పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించి వినతిపత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా సావధానంగా విన్న ఆమె సమస్యల పరిష్కారం కోసం సంబంధించిన అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు.