ఆదమరిస్తే ప్రమాదమే..!
VZM: బొబ్బిలి మండలం చిత్రకోట బొడ్డవలస గ్రామంలోని ప్రధాన వీధిలో కాలువలు లేక స్థానికులు, చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో సిమెంటు రహదారి నిర్మించి కాలువ ఏర్పాటు చేయకుండా వదిలేశారు. ఆదమరిచి రోడ్డు అంచుకు వెళ్తే ప్రమాదం జరుగుతుందని స్థానికులు వాపోతున్నారు. రాత్రివేళల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.