ఫార్మా సిటీలో భారీ అగ్నిప్రమాదం

AP: విశాఖ పరవాడ ఫార్మా సిటీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ తుక్కు గోదాములో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వాయువ్యంగా వ్యాపించిన ఈ మంటలను తగ్గించేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పెద్దఎత్తున దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కమ్మేయగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.